కొణిజర్ల, వెలుగు: గ్రామాల అభివృద్ధి బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులదే అని వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం బస్వాపురం రైతువేదికలో 19 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం 99 రోజుల ప్రగతి ప్రణాళికపై అధికారులతో సమీక్షించి, గ్రామాల అభివృద్ధికి అధికారులు, కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో సమిష్టిగా పనిచేయాలని సూచించారు.
