Harom Hara: అతడు పగబట్టిన కోడెత్రాచు..పగే అతడి ప్రాణం..కృష్ణ వీడియో వైరల్

Harom Hara: అతడు పగబట్టిన కోడెత్రాచు..పగే అతడి ప్రాణం..కృష్ణ వీడియో వైరల్

సుధీర్ బాబు (Sudheerbabu) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్-డ్రామా మూవీ హరోమ్ హర (Harom Hara).హరోమ్ హర మూవీని 1989 బ్యాక్ డ్రాప్తో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక.

ఈ సినిమా కోసం సుధీర్ బాబు చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట.అలాగే, ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా..పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్తో రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా..శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది. 

సుధీర్ బాబు క్రేజీ అప్డేట్ ఇస్తూ.."హరోంహర నుంచి చిన్న అప్‌డేట్..అదేంటో మీరే ఊహించాలి..అంటూ హంతకుడెరో తెలుసుకున్నా. ఎవరేమైనా అనండి ఆ హంతుకుడు మాత్రం ఈ ఇంట్లోవాళ్లకు సన్నిహితుడన్నది సత్యం. అతడు పగబట్టిన కోడెత్రాచు. పగే అతడి ప్రాణం" అనే హీరో కృష్ణ డైలాగ్‌ను ప్లే చేశాడు. 

ఇంతకీ సూపర్ స్టార్ కృష్ణకు హరోంహర అప్‌డేట్‌కు సంబంధమేంటనేది ఊహించండి మరి అంటూ..సుబ్రహ్మణ్యం మాస్ సంభవం లోడింగ్‌ అంటూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.