Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?

Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?

టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్య రెండోసారి తండ్రయ్యాడు. అతని భార్య పంఖురి శర్మ (ఏప్రిల్ 21) ఆదివారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పాండ్య ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా తెలియజేశాడు. ఈ జంట అతనికి "వాయు కృనాల్ పాండ్యా" అని పేరు పెట్టారు. కృనాల్, పంఖురి తమ మొదటి బిడ్డ కవిర్‌.. జూలై 2022లో జన్మించాడు. ఈ దంపతులకు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం  కృనాల్ పాండ్య ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. లక్నో సూపర్ జయింట్స్ తరపున మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. చివరి ఐపీఎల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడాడు. ఇతనికి ప్రముఖ వ్యాఖ్యాత.. భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తన టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్ లాడిన క్రునాల్ 5 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు బ్యాటింగ్ లోనూ రాణిస్తూ సత్తా చాటుతున్నాడు.