చైనా దళాలు ఎల్ఏసీకి కట్టుబడి ఉన్నాయి: లిజియాన్

చైనా దళాలు ఎల్ఏసీకి కట్టుబడి ఉన్నాయి: లిజియాన్

బీజింగ్: ఈస్టర్న్ లడఖ్ లోని పాంగాంగ్ ట్సూ సరస్సు తీర ప్రాంతంలో చైనా దళాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించాయి. అక్కడ నెలకొన్న యథాతథ స్థితికి భంగం కలిగించడానికి పీఎల్ఏ దళాలు యత్నించాయని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దులో మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తాజాగా ఈ వివాదంపై బీజింగ్ వర్గాలు స్పందించాయి.

‘లైన్ ఆఫ్ కంట్రో్ల్ కు చైనా దళాలు ఎప్పుడూ కట్టుబడే ఉన్నాయి. వాళ్లెప్పుడూ గీతను అతిక్రమించలేదు. గ్రౌండ్ లెవల్ లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇరు వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. దౌత్య పరమైన, మిలటరీ చానెల్స్ ద్వారా చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన సంప్రదింపులు, చర్చలకు సంబంధించి ఏమైనా చెప్పాల్సి వస్తే సమయం ప్రకారం మేం తెలియజేస్తాం’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ చెప్పారు.