కామారెడ్డి జిల్లాలో చిరుత పులి రేపింది. ఓ లేగ దూడపై దాడి చేసి చంపేసింది. లింగంపేట మండల కేంద్రం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మనోహర్ అనే రైతుకు చెందిన పశువుల కొట్టంలోకి చొరబడిన చిరుత.. పాకలో ఉన్న పశువులపై దాడి చేసింది. పలు పశువులను గాయపడగా.. ఒక లేగ దూడ మృతి చెందింది.
గ్రామంలోకి చిరుత పులి వచ్చిందన్న సంచారం తెలిపయడంతో పశువుల కాపరులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత పులి పాద ముద్రలు సేకరించారు అధికారులు.
చిరుత పులి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను బంధించి.. తమను కాపాడాలని కోరుతున్నారు గ్రామస్తులు. చిరుత కోసం బోను ఏర్పాటు చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
