
చియాన్ విక్రమ్ హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. ఆగస్ట్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో ఎన్వీ ప్రసాద్ ఎన్వీఆర్ సినిమా ద్వారా విడుదలౌతుంది. తాజాగా 'కోబ్రా'' చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించింది. విక్రమ్, శ్రీనిధి, మీనాక్షి, మృణాళిని రవి, నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ ప్రెస్ మీట్ లో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధిలు అడిగిన ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు ఇచ్చింది.
కోబ్రాలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి ?
విక్రమ్ : నిజంగా కోబ్రాలో ఇన్ని పాత్రలు గురించి మొదట ఆలోచన లేదు. ఒక్కసారి చూసుకునే సరికి తొమ్మిది విభిన్నమైన పాత్రలు వచ్చాయి. కోబ్రా చాలా ఇంటరెస్టింగ్ కథ. గణితం చాలా మందికి కష్టమైన సబ్జెక్ట్. అలాంటి గణితంను వాడి ఎలాంటి అడ్వెంచర్స్ చేశారనేది ఇందులో బ్రిలియంట్ గా ఉంటుంది. నాకు లెక్కలు సరిగ్గా రావు. కానీ ఇందులో లెక్కల మాస్టర్ గా చేశాను. (నవ్వుతూ). కథ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కథలో చాలా లేయర్లు ఉన్నాయి. దర్శకుడు అజయ్ అద్భుతంగా డీల్ చేశారు.
కోబ్రా అని టైటిల్ పెట్టారు.. ఇంతకీ కథానాయకుడు విలనా ? హీరోనా ?
విక్రమ్ : కోబ్రా ఎప్పుడు కాటేస్తుందో తెలీదు, అలాగే కోబ్రా తన చర్మాన్ని మార్చుకోగలదు. ఇందులో నా పాత్ర అలానే ఉంటుంది. ప్రతి పాత్రలో విభిన్నమైన పెర్ఫార్మెన్స్ ఉంటుంది. డబ్బింగ్ లో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నా కెరీర్ లో చాలా సవాల్ గా అనిపించిన సినిమా కోబ్రా.
అపరిచితుడులో గొప్ప సందేశం వుంటుంది. కోబ్రాలో అలాంటి సందేశం ఏమైనా ఇస్తున్నారా ?
విక్రమ్ : కోబ్రాలో సందేశం ఉండదు కానీ లవ్, ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషనల్ డ్రామా ఉంటుంది. దానికి ప్రేక్షకులు చాలా గొప్పగా కనెక్ట్ అవుతారు.
ఇంతకష్టమైన పాత్రలు చేయడానికి స్ఫూర్తి ఎక్కడి నుండి వస్తుంది ?
విక్రమ్ : నాకు నటన అంటే పిచ్చి. ఏదైనా భిన్నంగా చేయడానికే ప్రయత్నిస్తా. ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త అనుభూతిని పంచాలనేదే నా ప్రయత్నం.
ఇందులో నటించడానికి ప్రధాన కారణం ?
శ్రీనిధి : విక్రమ్ ఉన్నారు.. అజయ్ గత చిత్రం నాకు చాలా నచ్చింది. రెహ్మాన్ మ్యూజిక్. ఇంత మంచి టీంతో కలసి పని చేసే అవకాశం రావడమే గొప్ప విషయం.
విక్రమ్, యష్ లలో మీరు గమనించిన గొప్ప క్వాలిటీ ?
శ్రీనిధి : ఇద్దరూ నటన పట్ల అంకిత భావంతో ఉంటారు. విక్రమ్ ఇన్నేళ్ళుగా పని చేస్తున్నా.. సెట్స్ లో చాలా హంబుల్ గా ఉంటారు.
ఫర్ ఫార్మెన్స్, గెటప్ వేరియేషన్స్ ఉన్న సినిమాల వైపు ఎక్కువ మొగ్గు చూపడానికి కారణం ?
విక్రమ్ : ప్రభుదేవాని ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాడని అని అడిగితే ఏం చెప్తాం. నాకు తెలిసిందే ఇదే. దాన్ని చేయడంలోనే ఆనందం పొందుతాను. ఇప్పటికీ తమిళ్ లో టాప్ హీరోల్లో నేనూ ఒకడ్ని. హిట్స్ వచ్చాయా లేదా అనేది కాదు.. ప్రేక్షకుకులు నన్ను ప్రేమిస్తున్నారు. ప్రేక్షకులు నా నుండి ఇలాంటి పాత్రలు, సినిమాలు కోరుకుంటారు. వాళ్ళు కోరుకునేదే చేస్తున్నాను.
ఏ హీరోలతో పని చేయాలనీ ఉంది ?
శ్రీనిధి : అన్ని సినిమాలు, అందరి హీరోలతో కలసి పని చేయాలనీ ఉంది.
దర్శకుడు అజయ్ లో మీరు గమనించిన బెస్ట్ క్యాలిటీ ?
శ్రీనిధి : అవుట్ అఫ్ ది బాక్స్ ఆలోచిస్తారు. చాలా కమిట్ మెంట్ తో పని చేస్తారు. ఆయన చాలా స్మార్ట్.
విక్రమ్ సెట్స్ లో ఎలా ఉంటారు ?
శ్రీనిధి : చాలా సరదాగా ఉంటారు. చాలా ఫ్రాంక్ లు చేస్తారు.
మృణాళిని: విక్రమ్ తో షూటింగ్ అంటే సెట్ లో చాలా సీరియస్ గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయన మాత్రం గేమ్స్ ఆడుకుంటూ ఫ్రాంకులు చేస్తూ సరదాగా కనిపించారు. నా భయం అంతా పోయింది.
మీనాక్షి : విక్రమ్ గ్రేట్ యాక్టర్. ఆయన సెట్స్ లో ఉంటే గొప్ప ఎనర్జీ ఉంటుంది. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేయలేం.
తారాగణం: విక్రమ్, శ్రీనిధి శెట్టి, ఇర్ఫాన్ పఠాన్, మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి తదితరులు.
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ఆర్ అజయ్ జ్ఞానముత్తు
నిర్మాత: ఎస్ఎస్ లలిత్ కుమార్
బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
విడుదల: ఎన్వీఆర్ సినిమా (ఎన్వీ ప్రసాద్)
సంగీతం: ఏఆర్ రెహమాన్
డీవోపీ: హరీష్ కన్నన్
ఎడిటర్: భువన్ శ్రీనివాసన్
పీఆర్వో: వంశీ-శేఖర్