NEET Paper Leak: చదువుకున్న లీడర్ ను ఎన్నుకోండి.. అప్పుడే మనం బాగుపడతాం: మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ

NEET Paper Leak: చదువుకున్న లీడర్ ను ఎన్నుకోండి.. అప్పుడే మనం బాగుపడతాం: మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఘటనపై ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీక్ తో విద్యార్థులు చాలా ఇబ్బందులుపడ్డారు.. ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అయింది. ఇది చాలా తప్పు.. పేపర్ లీక్ పై ఏ ప్రభుత్వ ఏజెన్సీ కూడా స్పందించకపోవడం దారుణం. ప్రతి యేటా ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండటానికి కారణం మన ఎన్నుకున్న నిరక్ష్య రాస్యులైన నేతలే అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మన భవిష్యత్తు కోసం..దేశ భవిష్యత్తు కోసం.. దయచేసి  చదువుకున్న మంచి లీడర్ ను ఎన్నుకోండి అంటూ ప్రజలకు విజ్ణప్తి చేశారు. దురదృష్టం ఏమిటంటే విద్యలేని నేతలు, లామేకర్స్ తో మన విద్యావ్యవస్థ ఇలా తయారయింది.. మన భవిష్యత్తు , దేశ భవిష్యత్తు బాగుండాలంటే విద్యావంతుడైన లీడర్లను ఎన్నుకోవాలి అంటూ  ప్రజలకు విజ్ణప్తి చేశారు.  నీట్ పేపర్ లీక్‌పై విశాల్ దద్లానీ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో 10 మిలియన్ వ్యూస్ 1 మిలియన్ లైకులతో నెటిజన్లు స్పందించారు.  విశాల్ దద్లానీ పోస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. 

విశాల్ దద్లానీ ఆ పోస్టులో ఏమన్నారంటే.. ‘‘పేపర్ లీకేజీ లు దారుణం.. ప్రతియేటా ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతూనే ఉన్నాయి..విద్యార్థుల దుస్థితికి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను ..నీట్ పేపర్ లీక్ వల్ల విద్యార్థులు ఎంతో నష్టపోయారు. బాధపడ్డారు. టైం వృధా అయింది. విద్యాసంవత్సరం కోల్పోయారు. ఇది చాలా తప్పు’’ అని రాశారు. 

ఇంకా ‘‘ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఏజెన్సీ కూడా బాధ్యత వహించలేదు.. ఎవరైతే విద్యామంత్రిగా ఉన్నారో ఆయన  ఈ విషయం చాలా చిన్నది.. నేనెందుకు రాజీనామా చేయాలి అనడం సిగ్గుచేటు’’ అన్నారు. 

‘‘దురదృష్టం ఏంటంటే మనం జీవిస్తున్న సమాజంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉండటానికి అధికారంలో ఉన్నవారు ఎడ్యుకేటెడ్ కాకపోవడమే’’ అని అన్నారు. ఇది మన దేశాన్ని నాశనం చేస్తుంది. అందుకే విద్యావంతులను, మంచివాళ్లకు ఓటు వేసి లీడర్లుగా, ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోండి’’ అంటూ ప్రజలకు సూచించారు. 

ఇదిలా ఉంటే విశాల్ దద్లానీ పోస్ట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు  వ్యక్తమయ్యాయి.  
ఓ నెటిజన్ స్పందిస్తూ.. ప్రజలు రాజకీయ పార్టీల నీడ నుంచి, నాయకులు, నటులు మొదలైన వారి ఆదర్శాల నుంచిబయటకు వచ్చి, నిజాయితీపరులను, విద్యావంతులను, అభివృద్ధికి కృషి చేసేవారిని ఎన్నుకుని, వారిని జవాబుదారీగా నిలబెట్టాలని నేను భావిస్తున్నాను. విశాల్ భాయ్, మీరు ఎల్లప్పుడూ మంచి ఆశయానికి, సామాజిక న్యాయానికి అండగా నిలబడటాన్ని అభినందిస్తున్నాను అంటే రిప్లై ఇచ్చారు. 

 మరో నెటిజన్ స్పందిస్తూ ‘‘నాకు బీహార్ ముఖ్యమంత్రి గుర్తొచ్చారు. ఈ వీడియో పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలు.. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఈ పోస్టు  మరింత మందిని చేరుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి గొంతులు వారికి ఎంతో సాయపడగలవు’’ అంటూ కామెంట్ చేశారు. 

ఇంకో నెటిజన్ స్పందిస్తూ.. విశాల్ జీ, మీరు చాలా బాగా చెప్పారు. దేశం పట్ల, అలాగే విద్యార్థుల పట్ల మీకున్న శ్రద్ధను నేను అభినందిస్తున్నాను. మనం తప్పకుండా ఓటు వేసి, బాగా చదువుకున్న వ్యక్తికి మద్దతు ఇవ్వాలి. అని రిప్లై ఇచ్చారు. 
‘‘విశాల్ దద్లానీ చెప్పింది చాలావరకు కరెక్టు.. సమాజాన్ని తీర్చిదిద్దే విద్యావ్యవస్థలో లోపాలు  దేశానికే నష్టం.. విద్యావ్యవస్థను పటిష్టంగా నడిపించాలి.. అలాంటిది జరగాలంటే  విద్యావంతులైన నాయకులు, లామేకర్స్ ని ఎన్నుకోవడం అత్యవసరం అంటున్నారు ’’చాలామంది నెటిజన్లు.