లోన్ తీసుకుని జీతం పడగానే కట్టేస్తున్న సిటిజన్స్

లోన్ తీసుకుని జీతం పడగానే కట్టేస్తున్న సిటిజన్స్
  • అవసరమైన టైంలో తీసుకుని జీతం పడగానే కట్టేస్తున్న సిటిజన్స్
  • లోన్​ అమౌంట్​ ఇన్​స్టాల్​మెంట్​లో కట్టుకునే చాన్స్

‘‘మాదాపూర్​కి చెందిన విజయ్ ప్రైవేట్ ఎంప్లాయ్. నెలకి రూ.25 వేలు సంపాదిస్తున్నాడు. ఇంటి అద్దె, ఈఎంఐలు, ఇతర అవసరాలకు వస్తున్న జీతం సరిపోవట్లేదు. దీంతో ప్లే స్టోర్​లో ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టెంట్ లోన్లు ఇచ్చే యాప్స్ కోసం వెతికాడు. అలా తన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తో యాప్​నుంచి రూ.10 వేలు లోన్ తీసుకున్నాడు. లోన్ మనీని 3 నెలల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ మెంట్ పెట్టుకుని జీతం వచ్చాక కొంచెం కొంచెంగా క్లియర్​చేస్తున్నాడు.’’

‘‘ఉప్పల్ లో ఓ ఫ్లాట్​అద్దెకు తీసుకుని ఉంటున్న మహిమ ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తోంది. వచ్చే 15 వేల జీతం తన ఖర్చులకే సరిపోతుండడంతో ఇంటికి పంపించలేక ఇబ్బందులు పడింది. ఫ్రెండ్స్ ద్వారా లోన్ యాప్స్ గురించి తెలుసుకున్న ఆమె ఓ యాప్​లో రూ.5వేలు లోన్​తీసుకుంది. వాటిని తన ఖర్చులకు వాడుకుని జీతంలో కొంత ఇంటికి పంపిస్తోంది. లోన్ అమౌంట్​ని 3 నెలల ఇన్​స్టాల్​మెంట్​పెట్టుకుని నెలకు కొంత తీరుస్తోంది.’’

హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం సిటీలో ఇన్​స్టెంట్​ లోన్ యాప్స్ వాడేవారు పెరిగిపోయారు. వచ్చే జీతం సరిపోక యాప్స్​లో లోన్లు తీసుకొంటూ అవసరాలు తీర్చుకుంటున్నారు. తర్వాత విడతల వారీగా లోన్ అమౌంట్​ను క్లియర్​చేస్తున్నారు. స్టూడెంట్స్ నుంచి జాబర్స్ వరకు చాలా మంది స్మార్ట్​ఫోన్లలో ఈ తరహా మనీ అప్లికేషన్లు ఉంటున్నాయి. ప్లే స్టోర్​లో పదుల సంఖ్యలో మనీ లోన్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో నమ్మదగిన వాటిని చూసుకుని రిజిస్టర్ అవుతున్నారు. ఆధార్ కార్డు, పాన్ కార్డు డీటెయిల్స్ ఎంటర్​చేసి లాగిన్ అవుతున్నారు. రూ.2 వేల నుంచి రూ.50 వేలకు పైగా అప్లికేషన్లలో లోన్లు ఇస్తున్నారు. వచ్చే అమౌంట్ ఈ–వ్యాలెట్ కు యాడ్​అవుతుండగా అక్కడి నుంచే యూజర్స్​కరెంట్ బిల్లులు, గ్యాస్​బిల్లులు, రీఛార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, షాపింగ్ చేస్తున్నారు. 

శాలరీ రాగానే క్లియర్
ప్రస్తుతం ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆన్​లైన్ లోన్ యాప్స్​లో మనీ రిక్వెస్ట్ పెట్టుకుంటే వెంటనే అమౌంట్ ఈ–వ్యాలెట్​కు క్రెడిట్ అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ క్యాష్ ఆసరాగా నిలుస్తోందని యూజర్లు చెబుతున్నారు. ముఖ్యంగా నెలాఖరు టైంలో యాప్స్​లో అమౌంట్ తీసుకుని వాడుకుంటున్నామని, తిరిగి శాలరీ వచ్చాక కట్టేస్తున్నామని అంటున్నారు. ధని, నావి, క్రేజీ బి, క్యాష్ బీన్, లేజీ పే లాంటి యాప్స్​ను ఈ మధ్య జనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆన్​లైన్ యాప్స్​లో లోన్ తీసుకున్నాక ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాల్ మెంట్ కట్టడం లేట్ అయితే సదరు కంపెనీల నుంచి రిమైండర్ మెసేజ్ లు, కాల్స్ విపరీతంగా వస్తుంటాయి. కొన్ని కంపెనీల నుంచి రోజుకి 10 నుంచి 20 కాల్స్ రావడం, అమౌంట్ పే చేయాలని మెసేజ్ లు వస్తుండటంతో కొంతమంది తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. కాగా ఇన్ టైంలో పేమెంట్​చేస్తే వారికి ఇచ్చే లిమిట్​ని కంపెనీలు పెంచుతున్నాయి. 

ఇన్​టైంలో క్లియర్​చేస్తేనే..
ఏడాది కింద ఓ లోన్ యాప్ అకౌంట్​లో రిజిస్టర్ అయ్యాను. ముందు 2 వేలతో లోన్ అప్రూవ్ అయింది. ఆ అమౌంట్ కొన్ని నెలల తర్వాత పెరిగింది. ప్రస్తుతం 20 వేల లిమిట్ ఉంది. ఈ యాప్ ద్వారానే చాలా ఖర్చులు తీరుతున్నాయి. ఇన్​స్టాల్​మెంట్​డ్యూ డేట్​కి అటు ఇటుగా అమౌంట్ పే చేస్తున్నాను. పేమెంట్ లేట్ అయితే కాల్స్ వస్తున్నాయి. కానీ అవసరంలో వాడుకున్నాను కాబట్టి అమౌంట్ అందగానే ఫైన్​తో పే చేస్తున్నాను.   - మహేష్, టెక్నిషియన్, ఉప్పల్