పోలీసుల ప్రేక్షక పాత్ర.. నిందితులు 2 నిముషాల్లో దొరుకుతరు: ఆర్​ఎస్పీ ట్వీట్​

పోలీసుల ప్రేక్షక పాత్ర..  నిందితులు 2 నిముషాల్లో దొరుకుతరు: ఆర్​ఎస్పీ ట్వీట్​

హైదరాబాద్: అచ్చంపేటలో కాంగ్రెస్​గూండాల దాడిలో స్థానిక పోలీసుల ‘ప్రేక్షక పాత్ర’ చూడండి అంటూ బీఆర్ఎస్​నేత ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​డీజీపీ రవిగుప్తాకు సూచించారు. ‘ఆగంతకులు యధేచ్ఛగా హత్యాయత్నం చేస్తుంటే పోలీసు అధికారి ఎలక్ట్రానిక్​గాడ్జెట్ పట్టుకొని చోద్యం చూస్తున్నరు! ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే? ఇప్పుడే డీఎస్పీతో మాట్లాడితే నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని చెబుతున్నరు. ఆ ఇద్దరు పోలీసు ఆఫీసర్లు కనీసం ఒక్క నిందితున్ని కూడా పీఎస్ కు తీసుకరాలేకపోయారు! వాళ్ల మీద చర్య తీసుకోండి. ఈ దాడి జరుగుతుందని పోలీసులకు ముందరనే తెలువదా? ఇప్పుడైనా స్థానిక ఎమ్మెల్యేను తీసుకొచ్చి పోలీసు స్టేషన్​లో  ప్రశ్నించండి. నిందితులు రెండు నిముషాల్లో దొరుకుతరు’ అని ట్వీట్​చేశారు