యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్

యూనివర్సిటీలకు కొత్త వీసీలు.. ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణ లోని యూనివర్సిటీలకు కొత్త వీసీలు నియమించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త వీసీల కోసం 10 యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీ నియమించింది సర్కార్. రెండు మూడు రోజుల్లో సమావేశాలకు కసరత్తు చేస్తున్నారు. వారంపదిరోజుల్లో కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు చేస్తోంది రేవంత్  సర్కార్.  రాష్ట్రంలో 16 వర్సిటీలు ఉన్నాయి. వీటిలో బీఆర్‌అంబేద్కర్‌, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, పొట్టి శ్రీరాములు తెలుగు, మహత్మాగాంధీ, జేఎన్టీయూ, జేఎన్‌ఎఫ్‌ఏయూ వర్సిటీల వీసీల పదవీ కాలం ఈ ఏడాది మేతో ముగిసింది.