హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో టైమింగ్స్ పొడిగింపు

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో టైమింగ్స్ పొడిగింపు

న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న హైదరాబాదీల సౌకర్యార్థం డిసెంబర్ 31న మెట్రో టైమింగ్స్ ను పెంచుతున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన వాళ్లు సేఫ్​ గా ఇంటికి చేరుకునేందుకు మెట్రో పనివేళలను పొడిగించనున్నట్లు తెలిపింది. 

డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటన విడుదల చేసింది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో సంస్థ. డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా అన్ని టెర్మినల్ స్టేషన్స్ నుంచి జనవరి రాత్రి ఒంటిగంటకు చివరి ట్రైన్  బయలుదేరనున్నట్లు ప్రకటించారు. నగర వాసులకు సేఫ్ జర్నీ అందించేందుకు టైమింగ్స్ పెంచినట్లు ఎల్ అండ్ టీ ప్రకటన చేసింది. 

 న్యూఇయర్ సందర్భంగా హైదరాబాదీలు మెట్రో సదుపాయాన్ని ఉపయోగించి సేఫ్ జర్నీ చేయాలని సూచించింది. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా సిటీలో ట్రాఫిక్ సమస్యలను బయటపడేందుకు మెట్రో సరైన ఆప్షన్ అని పేర్కొంది.