- పండుగ టైంలో రోజుకు లక్ష వాహనాల ప్రయాణం
- సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఇబ్బంది రానీయొద్దు
- మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: సంక్రాంతి నేపథ్యంలో నేషనల్ హైవేలపై ట్రాఫిక్ రద్దీ నివారణకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రి కోమటిరె డ్డి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతేడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధి కాదులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారని చెప్పారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రోజుకు సుమారు లక్ష వాహనాల ప్రయాణం సాగుతుంది. దీనిపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
రేపు నేను తూపాన్సేట్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్త. మెయిన్ గా ఎల్బీనగర్, వనస్థలిపురం,హయగ్నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ప్రాంతా ల్లో వేలాది వాహనాల రద్దీ ఏర్పడుతుంది. ఇక్కడ ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ జామ్ కావడానికి వీల్లేదు. పండుగ రద్దీ ఉన్నన్ని రోజుల్లో రోడ్లు మూసేయొద్దు. భారీ యంత్రాలతో పనులు చేపట్టవద్దు. అత్యవసరమైనవి అయితే ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. రోడ్లపై మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలను పూర్తిగా తొ లగించాలి' అని సూచించారు.
బోర్డులు తప్పనిసరి
రోడ్డుపనులు జరుగుతున్న ప్రతి చోటా వగలు, రాత్రి స్పష్టంగా కనిపించేలా ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. హైవీజిబిలిటీ కోన్లు, బారికేడ్లు ఏర్పాటు చేసి పనులు జరిగే ప్రాంతం, ట్రాఫిక్ వెళ్లే దారి సృష్టంగా చూపాలి. ఎక్కుడా ట్రాఫిక్కు అయోమయం కలిగించేలా ఏర్పాట్లు ఉండకూడదు. రద్దీ ఎక్కువగా ఉండి ఆంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను మోహరించాలి.
ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలి. అన్ని సంబంధిత శాఖలు పోలీసుల నూచనలను తప్పనిసరిగా అమలు చేయాలి. అన్ని రహదారి ఘటనలను ప్రత్యేక కన్నిజెంట్ మెరేజ్ మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలి. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అగకుండా వెళ్లేలా అదనపు బృందాలను ఏర్పాటు చేయాలి' అని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు..
