సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. కన్నడ, తమిళంలో గుర్తింపు పొందిన సీరియల్ నటి నందిని బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని సూసైడ్ నోట్ రాసినట్టు తెలుస్తోంది. తన తల్లిదండ్రులు తన ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నారని, తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని నందిని తన నోట్‌లో తెలిపింది. అంతేగాకుండా ఇతర సమస్యల కారణంగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు పేర్కొంది.
నందిని మరణంపై టెలివిజన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. చాలామంది ఆమెను అంకితభావంతో పనిచేసే నటిగా గుర్తుంచుకుంటున్నారు. ఆమె మరణ వార్త తెలియగానే, తమిళ టెలివిజన్ పరిశ్రమకు చెందిన అనేక మంది కళాకారులు బెంగళూరుకు వెళ్లి ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
►ALSO READ | సోషల్ మీడియాలో సాయిబాబాపై తప్పుడు ప్రచారం.. సినీనటి మాధవీలతపై ఎఫ్ఐఆర్
తమిళంలో ఆమె నటించిన గౌరి సీరియల్ తో చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్ లో కనకదుర్గ పాత్రలో డబుల్ రోల్ చేశారు. ఆ సీరియల్‌లో ఆమె నటనకు ప్రేక్షకుల ప్రశంసలు లభించాయి.
కొత్తూరుకు చెందిన నందిని బెంగళూరులో నివసిస్తూ జీవా హూవాగిడే, సంఘర్ష, మధుమగలు , నీనాదే నా వంటి అనేక ప్రముఖ కన్నడ టెలివిజన్ సీరియల్స్‌లో సహాయక పాత్రల్లో నటించింది. అధికారులు ఈ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు
