జీవో 252ను సవరిస్తాం.. డెస్క్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ

జీవో 252ను సవరిస్తాం.. డెస్క్ జర్నలిస్టులకు మంత్రి పొంగులేటి హామీ

జర్నలిస్టులు అందరికీ ఒకే రకమైన గుర్తింపు ఉంటుందని.. రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు వేర్వేరు కాదని.. ఈ విషయంలో జారీ అయిన జీవో నెంబర్ 252ను సవరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రయోజనాలు అన్నీ జర్నలిస్టులు అందరికీ సమానంగా అందుతాయని.. ఈ విషయంపై ఎలాంటి అపోహలు, భయాలు పెట్టుకోవద్దని భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి. 

ప్రభుత్వ పరంగా అక్రెడిటేష‌న్ కార్డుదారుల‌కు వ‌ర్తించే ప్రతి ప్రయోజనాన్ని.. డెస్క్ జర్నలిస్టులకు అందించే విధంగా ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి. డెస్క్ జర్నలిస్టులు ఎవరూ అపోహ‌ల‌కు గురికావొద్దని.. జీవో 252లో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొంగులేటి.

2025, డిసెంబర్ 30వ తేదీ  సచివాల‌యంలో DJFT ( డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ తెలంగాణ) ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిశారు. అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి.. ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 252లోని అంశాలు.. ఆ జీవో డెస్క్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయం, వివక్షపై మంత్రి పొంగులేటికి వివరించారు DJFT ప్రతినిధులు. డెస్క్ జర్నలిస్ట్ ప్రతినిధుల ఆందోళనను గుర్తించిన మంత్రి.. ఈ జీవో 252ని సవరిస్తామని హామీ ఇచ్చారు. 

ఈ జీవో మార్పునకు సంబంధించి.. అన్ని జర్నలిస్ట్ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని.. ఆ సమావేశానికి డెస్క్ జర్నలిస్టులను ఆహ్వానిస్తామని.. ఆ సమావేశంలో మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఈ సమావేశం నిర్వహించిన తర్వాత మాత్రమే.. సవరణ జీవో వస్తుందని.. అప్పటి వరకు భయాందోళనలు పెట్టుకోవద్దని.. ఈ జీవోనే తుది నిర్ణయం కాదని కూడా భరోసా ఇచ్చారు మంత్రి పొంగులేటి. జర్నలిస్టులను రెండు విభాగాలుగా చూసే ఉద్దేశం.. ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని.. ప్రభుత్వం పరంగా అన్ని సంక్షేమ పథకాలు.. జర్నలిస్టులు అందరికీ వర్తింపజేస్తామన్నారు మంత్రి పొంగులేటి. 

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే.., జనవరి మొదటి లేదా రెండో వారంలో జర్నలిస్టు సంఘాలతో సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి పొంగులేటి. ఆ సమావేశంలోనే డెస్క్ జర్నలిస్టుల సమస్యలు. జీవో నెంబర్ 252లో సవరణలకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటామని కూడా మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.