MegaVictoryMass: ‘మెగా-విక్టరీ’ మాస్ సాంగ్‌ వచ్చేసింది.. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా చిరు & వెంకీ స్టెప్పులు

MegaVictoryMass: ‘మెగా-విక్టరీ’ మాస్ సాంగ్‌ వచ్చేసింది.. డాన్స్ ఫ్లోర్ దద్దరిల్లేలా చిరు & వెంకీ స్టెప్పులు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు' (MSG). ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు. వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూస్, ఈవెంట్స్తో బజ్ క్రియేట్ చేయడానికి రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన 'మీసాల పిల్ల', 'శశిరేఖ' పాటలు చార్ట్‌బస్టర్లుగా నిలిచి సినిమాపై హైప్‌ను పెంచేశాయి.

ఈ క్రమంలో లేటెస్ట్గా 'మెగా-విక్టరీ మాస్ సాంగ్' (Mega-Victory Mass Song)ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలోని అత్యంత ఆసక్తికరమైన క్రేజీ అప్‌డేట్ రావడంతో మెగా విక్టరీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈ మాస్ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి విక్టరీ వెంకటేష్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటకు విజయ్ పొలం కి అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారు.

ఈ పాటలో వెంకీమామకు చిరు వెల్ కం చెబుతూ.. "మార్నింగ్ గ్రీన్ టీ.. నైట్ అయితే నైంటీ.. ఎవడైతే ఏంటీ.. కుమ్మేద్దాం చంటీ.. ఏ వెంకీ.. ఇచ్చేయ్ ధమ్కీ" అని మొదలెట్టాడు. ఆ తర్వాత " స్పీడెమో 5జీ.. స్టయిలేమో జెన్ జీ.. వారేవా సర్ జీ.. వీ అర్ సో క్రేజీ.. ఏ బాసూ.." అని వెంకీ చిందేశాడు.

"అన్న నీవు నెక్స్ట్ లెవల్.. తమ్మీ నువ్వు బెస్ట్ లెవల్.. నువ్వు నేను వేరే లెవల్.. ఇద్దరి కాంబో పీక్స్ లెవల్.. ఎన్డీ బాసూ సంగతి అదిరిపోతాది సంక్రాంతి" అనే పదాలతో పాట కుమ్మేసింది. నకాష్ అజీజ్ మరియు విశాల్ దద్లానీ తమదైన శైలిలో పాడారు. మొత్తానికి 'మెగా-విక్టరీ' కాంబో ఒకే పాటలో కనిపించబోతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. 

ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వండర్ మూవీలో మెగాస్టార్ ఒక ఎన్.ఐ.ఏ (NIA) ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు మాస్ యాక్షన్ మిళితమైన ఈ చిత్రం సంక్రాంతి రేసులో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.