వైకుంఠ ఏకదాశి పర్వదినం సందర్బంగా రేపు( డిసెంబర్ 30న) మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి . ఈ క్రమంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక విమానంలో ఇవాళ(డిసెంబర్ 29న) సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రేవంత్ రెడ్డికి ఏపీ మంత్రులు అచ్చెం నాయుడు, పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన పద్మావతి వసతి గృహానికి వెళ్ళారు సీఎం రేవంత్ ఈ రాత్రికి అక్కడే ఉంటారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా డిసెంబర్ 30న ఉదయం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
మరో వైపు వైకుంఠ ఏకాదశి సందర్బంగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవాళ అర్థరాత్రి నుంచి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. రేపు ఉదయం 5 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ దర్శనం ప్రారంభమవుతుంది.
