SRH vs GT: ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC

SRH vs GT: ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌.. ప్రత్యేక బస్సులు నడపనున్న TSRTC

క్రికెట్ అభిమానుల‌కు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. గురవారం(మే 16) ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌కు 60 ప్రత్యేక బ‌స్సులు నడపనున్నట్లు తెలిపింది. ఈ బస్సులు మే 16వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:30 గంటల మధ్య 24 రూట్లలో తిరుగుతాయి. 

ఐపీఎల్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఈ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అభిమానులను తిరిగి తమ ఇళ్లకు చేర్చాలనే ఉద్దేశ్యంతో టీఎస్‌ఆర్‌టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక సౌకర్యాన్ని అభిమానులు ఉపయోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. స్టేడియం పరిసరాల్లో ప్రయాణికులు ఎక్కేందుకు, దిగేందుకు కంట్రోలర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ బృందాలు అందుబాటులో ఉంచారు. 9959226420, 9959226135, 99592226144 నంబర్లలో ఇన్‌ఛార్జి అధికారులను సంప్రదించవచ్చు. లేదా 9959226160, 9959226154 కమ్యూనికేషన్ సెంటర్ సెల్‌ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

గెలిస్తే.. ప్లేఆఫ్ బెర్త్‌

మే 16న సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్.. గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఆరంజ్ ఆర్మీ ప్లే విజయం సాధిస్తే..  ఆఫ్ బెర్త్ ఖరారైనట్లే. ఇప్పటివరకూ 12 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఏడింట విజయం సాధించింది. కమిన్స్ సేన.. ఇదే వేదికపై మే 19న ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.