సీపీఎస్ రద్దుకు కోర్టు ఉద్యోగుల మద్దతు

సీపీఎస్ రద్దుకు కోర్టు ఉద్యోగుల మద్దతు

హైదరాబాద్,వెలుగు: సీపీఎస్​ రద్దుకు ఈ నెల12న నిర్వహించే చలో హైదరాబాద్​కు సిటీ సివిల్ కోర్టు ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. మంగళవారం కోర్టు జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్​లో జరిగిన సమావే శానికి సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, సంఘం జనరల్ సెక్రటరీ కల్వల్ శ్రీకాంత్, జుడీషియరీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ  రిటైర్​ మెంట్ తర్వాత ఉద్యోగులు ఇబ్బందులు పడేలా సీపీఎస్ విధానం ఉందని చెప్పారు. ఎంప్లాయీస్​కు పింఛన్ ఇచ్చే ఓపీఎస్ విధానమే కావాలని కోరారు. రాష్ట్రంలో 1.72 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్​లో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. సర్వీస్ పింఛన్ కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. సమావేశంలో జుడీషియరీ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్  పవన్, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు పాల్గొన్నారు.