A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...

A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...

ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించటమే కాకుండా ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వంపై అవాస్తవాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. 

ఎన్నికల కోడ్ ఉల్లంగిస్తున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.వైసీపీ ఫిర్యాదును పరిశీలించి, సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది.ఈసీ ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన ఈసీ చంద్రబాబు, లోకేష్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబును A1గా, లోకేష్ ను A2గా చేర్చింది సీఐడీ. మరి, ఎన్నికలకు 8రోజుల సమయం ఉన్న నేపథ్యంలో కీలకంగా మారిన ఈ అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.