నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో దారుణం జరిగింది. నిండు గర్భిణీని గొంతు నులిమి చంపాడు భర్త. ఈ నెల 22వ తేదీ రాత్రి నిద్రిస్తున్న భార్య సుమలతను చంపాడు భర్త నాగేష్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను చంపి రెండో పెళ్లి చేసుకోవాలని నాగేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు.
చనిపోయాక సహజ మరణంగా చిత్రీకరించే యత్నం చేశాడు. అల్లుడు ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సుమలత తల్లి. ఈ మేరకు పోలీసులు నాగేష్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. పోలీసుల విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు నాగేష్. ఈ మేరకు నాగేష్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
