పీవీ స్మృతివనాన్ని వేగంగా పూర్తిచేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

పీవీ స్మృతివనాన్ని వేగంగా పూర్తిచేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

భీమదేవరపల్లి,వెలుగు: పీవీ స్మృతివనం నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. మాజీ ప్రధాని భారతరత్న పీవీ నరసింహారావు స్వగ్రామం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మాణంలో ఉన్న పీవీ విజ్ఞాన కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విజ్ఞాన కేంద్రంలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఫొటో గ్యాలరీ, సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, ఆడిటోరియం, ధ్యాన మందిరం తదితర విభాగాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. 

ఫొటో గ్యాలరీలో పీవీ నరసింహారావు జీవిత విశేషాలు, రాజకీయ ప్రస్థానం, దేశానికి చేసిన సేవలను ప్రతిబింబించే చిత్రాలు, అరుదైన జ్ఞాపకాలు, చారిత్రక అంశాల ప్రదర్శనపై పీవీ కుటుంబ సభ్యులతో చర్చించి పలు విలువైన సూచనలు చేశారు. దేశ రాజకీయ, ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన పీవీ గొప్ప వారసత్వాన్ని భావితరాలకు చేరవేసేలా ఈ విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దాలన్నారు. అంతకుముందు కలెక్టర్​ చాహత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  పీవీ స్మృతి వనాన్ని అధికారులతో కలిసి సందర్శించారు. కార్యక్రమంలో పీవీ కుమారులు ప్రభాకర్ రావు, రాజేశ్వర్ రావు, గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గజ్జెల సృజన, కుడా సీపీవో అజిత్​రెడ్డి, డీఈ రఘు, టూరిజం ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివాజీ, లీడర్లు పాల్గొన్నారు.