కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రూ. 4 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం

కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిపై రూ. 4 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి ఖుర్దు సమీపంలో కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రూ. 4కోట్లతో నిర్మించనున్న హైలెవల్​ వంతెన పనులను ఎమ్మెల్యే మదన్ ​మోహన్​ రావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అధునాతన టెక్నాలజీతో 30 మీటర్ల పొడవు,12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. 

ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.4.5 కోట్లు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల​ అధ్యక్షుడు గొల్ల సాయిరాం యాదవ్, మాజీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, నాయకులు ఎల్లమయ్య, నిజ్జన విఠల్, సోషల్​మీడియా ఇన్​చార్జ్ కుమార్​తదితరులు పాల్గొన్నారు.