ఐదు జీపీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేయండి : జేఏసీ ప్రతినిధి జంగిలి నవీన్

ఐదు జీపీలను తెలంగాణలో కలిపేందుకు కృషి చేయండి : జేఏసీ ప్రతినిధి జంగిలి నవీన్

భద్రాచలం,వెలుగు: ఆంధ్రాలో విలీనమైన ఏడు మండలాల్లోని ఎటపాక, పురుషోత్తపట్నం, పిచ్చకులపాడు, గుండాల, కన్నాయిగూడెం ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో విలీనం చేసేలా కృషి చేయాలని సీఎం రేవంత్​రెడ్డిని విలీన మండలాల జేఏసీ ప్రతినిధి జంగిలి నవీన్​కోరారు. ఈ మేరకు ఆయన గురువారం సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. 

భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మధ్యలో ఉన్న మార్గానికి అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయని, ఈ పంచాయతీల్లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమౌతున్నారని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఐదు పంచాయతీలను తిరిగి విలీనం చేయడం సమస్యల పరిష్కారానికి ఏకైక మార్గమని తెలిపారు.