హైదరాబాద్: అసెంబ్లీలో 22ఏ నిషేదిత భూముల జాబితాపై చర్చ జరపాలన్న బీజేపీ ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా శాసన సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో చర్చల తర్వాతే నిర్ణయాలు ఉంటాయని.. చర్చలు జరగకుండా నిర్ణయాలు ఉండవని స్పష్టం చేశారు. చర్చలు లేకుండా విచారణ జరగకుండా బాధ్యులపై చర్యలు ఎలా తీసుకుంటామని ప్రశ్నించారు.
సభా నాయకుడిగా నేను మాటిస్తున్నా.. బీజేపీ లెవనెత్తిన 22ఏ నిషేధిత జాబితాపై సభలో చర్చ జరుగుతుందని స్పష్టం చేశారు. సభ్యులు శాసస సభా సంప్రదాయాలను కాపాడాలని హితవు పలికారు. ప్రతిపక్షాలు చెప్పాలనుకున్న విషయాలను బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్లో చెప్పండని సూచించారు. అసెంబ్లీ ఎన్నిరోజులు కావాలంటే అన్ని రోజులు జరుపుతామని చెప్పారు.
ALSO READ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దళిత సమాజాన్ని అవమానించారు..
22ఏ నిషేధిత జాబితాపై చర్చ జరిగితే బీఆర్ఎస్ తమ భూ అక్రమ దందాలు బయటపడతాయని భయంతో అసెంబ్లీ బయట డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. తమ చీకటి మిత్రులను కాపాడేందుకు సభలో బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కాగా, సోమవారం (సెప్టెంబర్ 7) తెలంగాణ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా.. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోన్న 22ఏ నిషేధిత భూములు జాబితాపై చర్చకు బీజేపీ పట్టుబట్టడంతో అసెంబ్లీలో వాయిదా పడింది.
