బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలి: సీఎం రేవంత్

బీఆర్ఎస్  ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలి: సీఎం రేవంత్

స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026 సెప్టెంబర్ 7న అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్.. తల్లిని అవమానిస్తే ఎవరైనా ఊరుకుంటారా..? అని అన్నారు. సభాపతిని అవమానిస్తే అది సభ్యులందిరినీ అవమానించినట్లేనని అన్నారు. సభాపతిపై జుగుప్సాకరంగా మాట్లాడిన ఎమ్మెల్సీని డిస్మిస్ చేయాలని శాసన మండలి ఛైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. 

ALSO READ ; సభా నాయకుడిగా నేను మాటిస్తున్నా.. 

  సీఎం కామెంట్స్:

  • అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు
  • ఆయన దొరవారు కావచ్చు, నేను రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు పండితులు కావచ్చు.. 
  • అందరికీ సమానమైన సభాపతి మీరు
  • మీ అనుమతి, ఆదేశాలతోనే సభ జరుగుతుంది
  • అలాంటి మీ పైనే ఇంత జుగుప్సా కరంగా మాట్లాడారంటే ఆ పార్టీ విధానాలు ఎలా ఉన్నాయో ఆలోచించండి..
  • ఆ పార్టీ దళితులపై వ్యవహరించిన తీరు బాధాకరం
  • దళితులను సీఎం చేస్తానని, మూడెకరాలని, చివరికి దళిత డిప్యూటీ సీఎంను తొలగించారు
  • నేరెళ్లలో దళితులను ఇసుక లారీలతో తొక్కించారు
  • ఖమ్మంలో గిరిజనులను కొట్టించారు
  • కాంగ్రెస్ పార్టీ ఒక దళిత నేతను కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా చేస్తే..
  •  ఆ నాయకుడిని అవమానించిన విధానం చూశాం
  • దళితుడిని ప్రతిపక్ష నేతగా చూడలేకపోయారు..
  • వీరి ఆలోచిన దళిత వ్యతిరేక ఆలోచన
  • దళితులు అంటే వీరికి పడదు
  • వీరి ప్రవర్తనను నియంత్రించకపోతే రాబోయే తరానికి అవమానం
  • అలాంటి సభ్యుడిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది
  • సభలో భాష బాలేదని సభకు కేసీఆర్ రావటం లేదని అంటున్నారు. 
  • సభల్లో, అసెంబ్లీల్లో మాట్లాడే భాషపై విధివిధానాలు తయారు చేద్దాం
  • తల్లిని అవమానకరంగా మాట్లాడితే బాధ కాదా
  • సభానాయకుడిపై అవమానకరంగా మాట్లాడితే అది మా అందరికీ అవమానకరం
  • సభ్యులు తప్పు చేయవద్దు, తప్పులు చేసే వాళ్లతో ఉండకూడదు
  • అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది.
  • ఈ రోజు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది
  • స్వాంతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు జరగలేదు
  •  దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది.