T20 World Cup: దక్షిణాఫ్రికా విజయం.. సంతోషంలో భారత్

T20 World Cup: దక్షిణాఫ్రికా విజయం.. సంతోషంలో భారత్

T20 World Cup: టీ20 ప్రపంచ కప్ సూపర్–8 మ్యాచ్ లో వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సఫారీ జట్టు సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో ప్రోటీస్ టీమ్ కంటే భారత క్రికెట్ అభిమానులకు మరింతగా సంతోష పెట్టింది. అయ్యో అదెలా అని మీరు అనుకుంటున్నారా?. 

ప్రస్తుతం పాయింట్ల టేబుల్ లో సౌతాఫ్రికా (4 పాయింట్లు, +2.890 నెట్ రన్ రేట్), వెస్టిండీస్ (2 పాయింట్లు, +1.791) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కానీ భారత జట్టు (-3.800), జింబాబ్వే టీమ్ (-5.350) ఇంకా పాయింట్ల ఖాతా ఓపెన్ చేయలేదు. గ్రూప్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారికి సెమీస్ చేరుకునే ఛాన్స్ ఉంటుంది. అలా జరగాలంటే టీమిండియా ముందు ఉన్న ఏకైక మార్గం.. రాబోయే 2 మ్యాచుల్లో (జింబాబ్వే, వెస్టిండీస్)తో భారీ తేడాతో విజయం సాధించడమే. 

భారత జట్టు నెట్ రన్ రేట్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.. కాబట్టి, ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు చెప్పినట్లుగా భారత్ నెట్ రన్ రేట్ గురించి ఆలోచించకుండా.. మ్యాచ్ గెలుపుపై దృష్టి పెడితే చాలు అని చెబుతున్నాఉ. అప్పుడు వెస్టిండీస్, జింబాబ్వే టోర్నమెంట్ నుంచి నిష్ర్కమిస్తాయి. దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ లోకి వెళ్తాయి. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన సఫారీ జట్టు తన చివరి మ్యాచ్ ని మార్చి 1వ తేదీన జింబాబ్వేతో ఆడబోతుంది. అందులో గెలిస్తే నెంబర్ స్థానంతో సెమీస్ కి చేరుతుంది.