ట్యాంక్ బండ్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ విద్యార్థి సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతన చేపట్టిన నిరసనలో పాల్గొని మాట్లాడారు.
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. వారికి మద్దతుగా రాష్ట్రంలో ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరసయ్య పాల్గొన్నారు.
