ధర్మేంద్ర రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ధర్మేంద్ర రాజీనామా చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

రఘునాథపల్లి, వెలుగు : నీట్ పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, స్టూడెంట్ల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. 

జనగామ జిల్లా రఘునాథపల్లిలో శుక్రవారం నిర్వహించిన సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు.  నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.