సలార్ టికెట్ డబ్బులు రీఫండ్.. అప్ సెట్ అవుతున్న ఫ్యాన్స్

సలార్ టికెట్ డబ్బులు రీఫండ్.. అప్ సెట్ అవుతున్న ఫ్యాన్స్

సలార్(Salaar) పోస్ట్ పోన్ న్యూస్ తో ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అయ్యారు. నిజానికి ఈ సినిమాపై ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకున్నారు. ప్రభాస్ నుండి వచ్చిన గత మూడు సినిమాలి నిరాశపరచడంతో.. సలార్ ఆ లోటు తీర్చుతుందని ఆశపడుతున్నారు. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురుచూశారు. సెప్టెంబర్ 28 కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. 

తీరా సెప్టెంబర్ నెల వచ్చేసరికి చేతులెత్తేశారు మేకర్స్. సినిమా పోస్ట్ పోన్ అని చెప్పి ఫ్యాన్స్ కు షాకిచ్చారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక ప్రభాస్ ఓవర్ సీస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా వాయిదా పడటంతో టికెట్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారు థియేటర్స్ యాజమాన్యం. 

సలార్ సినిమా వాయిదాకు ముందే ఓవర్సీస్ మార్కెట్లలో కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు అనుకోకుండా రిలీజ్ క్యాన్సిల్ కావడంతో వాళ్ళకు టికెట్ అమౌంట్ రిఫండ్ చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ అప్‌సెట్ అవుతున్నారు.