టీవీల్లో పాఠాలు చెబుతున్నారు

టీవీల్లో పాఠాలు చెబుతున్నారు

ట్రెంటన్ : లాక్ డౌన్ కారణంగా స్టూడెంట్స్ లెసన్స్ మిస్సవ్వకుండా అమెరికాలో టీచర్స్ స్మార్ట్ గా ప్లాన్ చేశారు. స్థానిక టీవీ చానెళ్ల ద్వారా ప్రతి స్టూడెంట్ పాఠాలు వినేలా ఏర్పాట్లు చేశారు. టీచర్లంతా ఇంట్లోనే లెస్సన్ చెబుతూ దాన్ని రికార్డ్ చేసి టీవీ చానెల్ కు పంపిస్తున్నారు. ఈ లెస్సన్స్ ను వీక్ డేస్ లో రోజు గంట పాటు ఎపిసోడ్స్ గా ప్రసారం చేస్తున్నారు. కొన్ని స్కూల్స్ స్టూడెంట్స్ కు ఆన్ లైన్ ద్వారా పాఠాలు చెబుతున్నాయి. ” ఇది చాలా సంక్షోభ సమయం. ఈ సమయంలో వీలైనంత వరకు విద్యార్థులకు మేలు చేసే కార్యక్రమం చేయాలి. అందుకే న్యూ జెర్సీ లో టీవీ చానెల్ ద్వారా స్టూడెంట్స్ కు పాఠాలు చెబుతున్నాం. ఈ విధానంలో స్టూడెంట్స్ టీచర్ ను చూస్తూ లెసన్స్ నేర్చుకోవచ్చు ” అని స్మిత్ అనే టీచర్ తెలిపారు. న్యూ జెర్సీ స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ న్యూజెర్సీ టీవీ ద్వారా ఏప్రిల్ 6 నుంచే పాఠాలు చెప్పటం షురూ చేసింది. ఒక్క నూయార్క్ మాత్రమే కాదు న్యూజెర్సీ, న్యూ మెక్సికో సహా పలు రాష్ట్రాల్లో టెలివిజన్ బ్రాడ్ కాస్ట్ లతో ఎక్యుకేషనల్ డిపార్ట్ మెంట్స్ ఒప్పందం చేసుకున్నాయి. అన్ని పబ్లిక్ మీడియా చానెళ్లు ఇలా ప్రసారం చేస్తే స్కూల్స్ బంద్ ఉన్న స్టూడెంట్స్ పాఠాలు నేర్చుకోవచ్చని టీచర్స్ చెబుతున్నారు. ఆన్ లైన్ ద్వారా పాఠాలు చెప్పాలంటే స్టూడెంట్స్ అందరికీ లాప్ టాప్, కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులో ఉండకపోవచ్చు టీవీలు అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతాయని న్యూయార్క్ స్టే ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ విధానానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. టీవీలో పాఠాలు విని తన 9 ఏళ్ల కుమారుడు 6 పోయామ్స్ రాశాడని ఓ తండ్రి చెప్పారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు ఇదే విధంగా లెసన్స్ చెబుతామని న్యూజెర్సీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ తెలిపింది.