జార్ఖండ్ లో జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 05వ తేదీన బలపరీక్షలో నెగ్గింది. 47 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం చంపాయ్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం బలపరీక్షలో విజయం సాధించగా.. 29 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. జార్ఖండ్ సీఎంగా చంపాయ్ సోరెన్ కొనసాగననునన్నారు. ఓటింగ్ కు మాజీ సీఎం హేమంత్ సోరెన్ కూడా హాజరయ్యారు. జార్ఖండ్‌లో నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంపయ్ సొరెన్ ప్రభుత్వానికి నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరిగింది.
జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి 45 సీట్లు(జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి) ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు అవసరం కాగా 45 ఓట్లతో కూటమి బలపరీక్షలో విజయం సాధించింది.
బల పరీక్షకు ముంద అసెంబ్లీ మాట్లాడిన మాజీ సీఎం, JMM చీఫ్ హేమంత్ సోరెన్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ల్యాండ్ స్కాం కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్. ధైర్యముంటే తన పేరు మీద భూమి రిజిస్టర్ అయిన ఆధారాలు చూపెట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపిస్తే ... రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. తన అరెస్ట్ వెనుక రాజ్ భవన్ హస్తం ఉందని ఆరోపించారు. అసెంబ్లీలో బలపరీక్షకు కోర్టు అనుమతితో హాజరయ్యారు హేమంత్ సోరెన్. తాను ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు హేమంత్.
