V6 News

మేం పన్నులు కట్టాలి.. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

మేం పన్నులు కట్టాలి.. ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలి: సీఎం రేవంత్ రెడ్డి

పన్నులు కట్టాలి, ఢిల్లీకి వెళ్లి సలాం కొట్టాలన్నట్టు  దక్షిణాది పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి పద్ధతికి తాము  వ్యతిరేకమని అన్నారు . దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్స్..ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్స్ గా  ఉన్నాయన్నారు. పొలిటికల్ క్యాపిటల్స్ ఎప్పుడూ  ఫైనాన్షియల్ క్యాపిటల్స్ ను తక్కువ చేసి చూస్తాయని..అపుడు దక్షిణాది రాష్ట్రాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లుకు, డీలిమిటేషన్ కు లింక్ పెట్టొదన్నారు రేవంత్.

సీట్ల పున‌ర్విభ‌జ‌నలో  హైబ్రీడ్ మోడ‌ల్ ను పాటించాలని డిమాండ్ చేశారు రేవంత్.   పెంచాల‌నుకుంటున్న 272 సీట్లలో 136 సీట్లు జనాభా ప్రకారం..మరో  136 సీట్లు జీఎస్ డీపీ ప్రకారం సీట్ల పున‌ర్విభ‌జ‌న చేయాలన్నారు.  స్థూల ఉత్పత్తిలో అత్యధికంగా భాగ‌స్వామ్యం చేస్తున్న రాష్ట్రాల‌కు అవ‌కాశం ఇవ్వాలన్నారు.  ఈశాన్య రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జ‌నాభా ప్రాతిపాదిక‌న సీట్లు లేవని చెప్పారు రేవంత్.  100 శాతం జ‌నాభా ప్రాతిప‌దిక‌న సీట్ల పెంపు జ‌ర‌గ‌లేదని... ప్రాతినిధ్యం కోస‌మే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారని తెలిపారు. 2028 మార్చి వ‌ర‌కు ఈ ప్రక్రియ‌ను పూర్తి చేయొచ్చని చెప్పారు. హ‌డావుడి గా చేసి దేశంలో  నార్త్, సౌత్  మ‌ధ్య గ్యాప్ పెంచొద్దని సూచించారు రేవంత్.