హైదరాబాద్: 2026, మే 23న సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమ వివరాలను యాదగిరిగుట్ట ఆలయ ఈవో భవాని మంగళవారం (మే 19) శంకర్ వెల్లడించారు. ఈనెల 23వ తేదీన యాదగిరిగుట్టలోని టెంపుల్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహ స్వామి వేద పాఠశాలకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరుగుతుంది. అలాగే, కొండపైన నిర్మించనున్న కళ్యాణ మండపం, దీక్షపరుల సదనం, మెట్ల మార్గానికి పై కప్పు, ప్రధానాలయం వాయువ్య దిశలో మాడ వీధుల్లోకి వెళ్లడానికి నిర్మించే మెట్ల మార్గానికి కూడా శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. మే 22న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి రానున్నారని తెలిపారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అనుగ్రహం బాషణం చేయనున్నారని చెప్పారు.
