మూసారాంబాగ్ బ్రిడ్జి నేడే (ఆగస్ట్ 31) ప్రారంభం.. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే..

మూసారాంబాగ్ బ్రిడ్జి నేడే (ఆగస్ట్ 31) ప్రారంభం.. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే..

హైదరాబాద్ సిటీ, వెలుగు: మూసారాంబాగ్ బ్రిడ్జిని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. ఆదివారం చీఫ్ ఇంజినీర్ రత్నాకర్, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బ్రిడ్జిని పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మూసారాంబాగ్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి మలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్, దిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సుఖ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్, నాగోల్ ప్రాంతాలకు రాకపోకలు ఈజీగా మారుతాయన్నారు. అనంతరం నల్గొండ ఫ్లైఓవర్ పనులను తనిఖీ చేశారు.

ప్రధాన ఫ్లైఓవర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని,  ఏ4 అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-ర్యాంప్ పనులను, చంపాపేట్​వైపు వెళ్లే ఏ3 సైడ్ ర్యాంప్ పనులను 2-3 రోజుల్లోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే చంచల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ, సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, ఒవైసీ హాస్పిటల్, కంచన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, చంపాపేట్​, సాగర్ రోడ్ మార్గాల్లో ప్రయాణించే వారికి జర్నీ ఈజీ అవుతుంది.