ప్రజలు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలి..మధ్యాహ్నం పూట అవసరమైతేనే బయటకు రావాలి: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌

ప్రజలు అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలి..మధ్యాహ్నం పూట అవసరమైతేనే బయటకు రావాలి: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌
  • మధ్యాహ్నం పూట అవసరమైతేనే బయటకు రావాలి: సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి 
  • వైద్యారోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
  • వడదెబ్బ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
  • రాష్ట్రవ్యాప్తంగా ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో భానుడి భగభగలు, తీవ్రమైన వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మధ్యాహ్నం పూట అవసరమైతే తప్ప బయటకు రాకూడదన్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత మరీ ఎక్కువగా ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఆయా జిల్లాల యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లాల కలెక్టర్లకు తగిన దిశానిర్దేశం చేయాలని  సీఎస్ రామకృష్ణారావుకు సూచించారు. ఎండదెబ్బ నుంచి ఉపశమనం పొందేందుకు పట్టణ ప్రాంతాల్లో తక్షణమే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల  నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది పూర్తి అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండాలని స్పష్టం చేశారు. వడదెబ్బ బారిన పడి ఆసుపత్రులకు వచ్చేవారికి తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించేలా అన్ని రకాల మందులను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలని, ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విపరీతమైన ఎండల పట్ల ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

క్రైమ్ రివ్యూ మీటింగ్‌‌‌‌లు తప్పనిసరి

ఎస్పీలు నిరంతరం తమ జిల్లాల్లో పర్యటించాలని, ఐజీ స్థాయి అధికారులు వారిని పర్యవేక్షించాలని, క్రైమ్ రివ్యూ మీటింగ్‌‌‌‌లు తప్పనిసరిగా నిర్వహించాలని సీఎం రేవంత్‌‌‌‌ ఆదేశించారు. మెరిట్‌‌‌‌ ఆధారంగానే అధికా రులకు పోస్టింగ్స్ ఇవ్వాలన్నారు. డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పోలీసుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామని, ఐపీఎస్‌‌‌‌ అధికారుల సంఖ్య పెంపు కోసం కేంద్రంతో సంప్ర దింపులు జరుపుతున్నామని సీఎం వెల్లడించారు.  అన్ని విభాగాలు, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం లోపించకూడదని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాల ముందస్తు నివారణ చర్యలపై ఫైర్ డిపార్ట్‌‌‌‌మెంట్ దృష్టి సారించాలన్నారు. మున్సిపల్ శాఖ, హైడ్రాతో సమన్వయం చేసుకుని జూన్‌‌‌‌ 15లోగా ఫైర్‌‌‌‌ సేఫ్టీపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలన్నారు. నగరంలో నాలాల నిర్వహణలో మెట్రో వాటర్ వర్క్స్‌‌‌‌తో.. మ్యాన్‌‌‌‌హోల్స్ నిర్వహణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల మధ్య సమన్వయం ఉండాలన్నా రు. సిటీలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం సీఎం ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాలని, సీపీలు, జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆయన తేల్చిచెప్పారు.