రైతులను శ్రీమంతులను చేయడం, హరిత తెలంగాణే తమ సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడిన రేవంత్.. తెలంగాణ రైతన్నను దేశంలో నంబర్ గా నిలబెడుతామని చెప్పారు. తుమ్మిడి హెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రతో చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు తిరిగి ప్రాణం పోస్తామన్నారు రేవంత్.
సీఎం రేవంత్ కీలక కామెంట్స్
- జూన్ 2న ఒక భావోద్వేగ సందర్భం
- తెలంగాణ కల సాకారం చేసిన సోనియాకు కృతజ్ఞతలు
- ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నాం
- ప్రజాపాలనను ఆదరించే జనం మాకు అండగా ఉంటున్నారు
- వరుస ఎన్నికల్లో మాపై భాద్యత పెరిగింది
- ఆత్మగౌరవం,స్వేచ్ఛ,సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నాం
- నియంతృత్వాన్ని తెలంగాణ గడ్డ సహించదు
- ప్రభుత్వం అంటే 4 కోట్ల ప్రజల భాగస్వామ్యం
- ఆత్మగౌరవం,స్వేచ్ఛ,సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నాం
- నియంతృత్వం,రాచరిక పోకడలను ప్రజలు ఓడించారు
- ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
- హరిత తెలంగాణను ఆవిష్కరించడమే లక్ష్యం
- వరి,మక్క,పత్తి సాగు గణనీయంగా పెరిగింది
- తెలంగాణ రైతన్నను దేశంలో నంబర్ గా నిలబెడుతాం
- ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ టాప్
- అభివృద్ది,సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నాం
- రైతులను పారిశ్రామిక వేత్తలుగా తీర్దిదిద్దుతున్నాం
- జొన్న కొనుగోలు రూ. 1154 కోట్లు చెల్లించాం
- గత పదేళ్లలోనూ తెలంగాణలో సాగునీటి పరిస్థితి మారలేదు
- తెలంగాణ హక్కుల సాధన కోసం అన్ని రంగాల్లో పోరాడుతున్నాం
- ఇప్పటి వరకు సంక్షేమానికి రూ. 1. 56 లక్షల కోట్లు కేటాయించాం
- ఎన్ని ఇబ్బందులున్నా రైతుల నుంచి చివరి గింజ వరకు కొంటాం
- ఇప్పటి వరకు పంట కొనుగోళ్లపై రైతులకు రూ. 82 వేల కోట్లు చెల్లించాం
- రైతుల నుంచి 10 వేల టన్నుల తడిసిన ధాన్యం కొనుగోలు చేశాం
- ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్కు తిరిగి ప్రాణం పోస్తాం
- తుమ్మిడి హెట్టి నిర్మాణం కోసం మహారాష్ట్రకు విజ్ఞప్తి చేస్తున్నా
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం
- తెలంగాణ మహిళలు దేశానికే ఆదర్శంగా మారారు
- ఆడబిడ్డలను పారిశ్రామిక వేత్తలుగా మార్చేందుకు రూ. లక్ష కోట్ల రుణాలిస్తాం
- ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందజేశాం
- ఆడబిడ్డల సంక్షేమంతోనే మా పాలన మొదలైంది
- మహిళలు ఆర్టీసీలో రూ. 10 వే లకోట్ల విలువైన ప్రయాణాలు సాగించారు
- తెలంగాణ సాధన కోసం నిరుద్యోగ యువత పోరాటం చేసింది
- విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం
- ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 20వేల400 కోట్లుకేటాయించాం
- నాలుగున్నర లక్షల ఇల్లు నిర్మించాలనే లక్ష్యం
