కాక్రోచ్ జనతా పార్టీ X అకౌంట్ బ్లాక్ : సోషల్ మీడియా పార్టీకే ఇంత భయమా..?

కాక్రోచ్ జనతా పార్టీ X అకౌంట్ బ్లాక్ : సోషల్ మీడియా పార్టీకే ఇంత భయమా..?

ఆశ్చర్యం.. సంభ్రమాశ్చర్యం.. అవును.. సోషల్ మీడియాలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ.. బొద్దింక జనతా పార్టీ (CJP) అకౌంట్ ను ఎక్స్ (X) బ్లాక్ చేసింది. ఇండియాలో ఈ అకౌంట్ పై లీగల్ యాక్షన్ తీసుకోవటం జరిగిందని.. బ్లాక్ చేయటం జరిగిందని ప్రకటించింది ఎక్స్. 

ఇదంతా ఒకటి అయితే.. ఇన్ స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ బీజేపీ.. భారతీయ జనతా పార్టీని అధిగమించిన కొన్ని గంటలకే ఇలాంటి నిర్ణయం రావటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. 

సోషల్ మీడియాలో పుట్టిన ఓ పార్టీని బ్లాక్ చేయటంపై నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదెక్కడి చోద్యం.. ఇదెక్కడి విడ్డూరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జస్ట్ మీమ్స్ మాత్రమే ఉంటాయని.. ఇందులో ఎలాంటి పొలిటికల్ కంటెంట్ ఉండదని స్పష్టం చేయటం జరిగింది. 

భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా బ్లాక్ చేయటంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. ఊహించినట్లే బొద్దింక జనతా పార్టీ ఖాతాను భారతదేశంలో నిలిపివేశారు అంటూ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. సోషల్ మీడియా వేదికల్లో కాక్రోచ్ జనతా పార్టీ వీర విహారం చేస్తున్న సమయంలో ఇలాంటి చర్య తీసుకోవటం చూస్తుంటే.. దీని వెనక ప్రభుత్వం హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, నిరుద్యోగం, గోడి మీడియాలపై మీమ్స్ రావటం, వ్యంగ్యంగా చర్చలు రావటంతో కాక్రోచ్ జనతా పార్టీకి అనూహ్య స్పందన వచ్చింది. యూత్ విపరీతంగా లైక్స్, షేర్లు కొట్టారు. జస్ట్ 5 రోజుల్లోనే 13 మిలియన్స్ అంటే కోటి 30 లక్షల మంది ఫాలోవర్స్ తో ఇన్ స్టాలో రికార్డ్ క్రియేట్ చేసింది ఈ పార్టీ. జస్ట్ 5 రోజుల్లోనే.. బీజేపీ పార్టీకి ఇన్ స్టాలో ఉన్న ఫాలోవర్స్ ను మించిపోయింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే.. ఎక్స్ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేయటం అనేది అందర్నీ షాక్ కు గురిచేసింది. 

ఇది ఊహించిందే అని.. ఇలా జరుగుతుందని ముందే ఊహించామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే చెప్పటం చూస్తుంటే.. బీజేపీ పార్టీపైనే అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి.