V6 News

చిన్నారుల హెల్త్ పై శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ సత్య శారద

చిన్నారుల హెల్త్ పై శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ సత్య శారద

ఖిలా వరంగల్ (మామునూర్), వెలుగు: చిన్నారుల భవిష్యత్తే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని వరంగల్​ కలెక్టర్ సత్య శారద అన్నారు. శుక్రవారం జిల్లాలోని శంభునిపేట, గుంటూరుపల్లి ప్రాంతాల్లోని అంగన్​వాడీ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి, సేవలను పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య సేవలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

గుంటూరుపల్లి అంగన్​వాడీ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శంభునిపేటలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ నిర్వహించి, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్యవివాహాల నియంత్రణలో మహిళలు ముందుండి అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజమణి తదితరులు పాల్గొన్నారు.