ఘనంగా గణేశుడి నిమజ్జనం

ఘనంగా గణేశుడి నిమజ్జనం

నెట్​వర్క్, వెలుగు: నవరాత్రులూ సేవలందుకున్న గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని శుక్రవారం పలు చోట్ల వేడుకగా నిర్వహించారు. ఆదిలాబాద్​లోని వినాయక్ ​చౌక్ ​శ్రీ సరస్వతీ శిశుమందిర్​వినాయకుడి సార్వజనిక శోభాయాత్రను కలెక్టర్​రాజర్షి షా, ఎస్పీ అఖిల్​మహాజన్, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్‌‌‌‌పర్సన్ బండారి అనూష జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ, సార్వజనిక్స్ అధ్యక్షుడితో కలిసి సార్వజనిక శోభాయాత్ర రథాన్ని ప్రారంభించారు. నగరంలోని వీధుల గుండా బాసర వరకు శోభాయాత్ర సాగింది. నిర్మల్ లో బీజేపీ ఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎస్పీ జానకీ షర్మిల, కౌన్సిలర్లతో కలిసి నిమజ్జన వేడుకలను ప్రారంభించారు. మంచిర్యాల, సిరిసిల్ల, కాగజ్​నగర్​లో భారీ బందోబస్తు మధ్య నిమజ్జన వేడుకలు నిర్వహించారు.