అక్టోబర్ నుంచి కల్కి2 షూటింగ్

అక్టోబర్ నుంచి కల్కి2 షూటింగ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌‌ షూటింగ్‌‌కు రంగం సిద్ధమవుతోంది.  వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌పై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.   ప్రస్తుతం సీక్వెల్‌‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మరింత భారీ స్థాయిలో రూపొందనున్న ఈ చాప్టర్ కోసం నాగ్ అశ్విన్  ఇంటెన్స్ వర్క్ చేస్తున్నారు. వరల్డ్, స్కేల్, కథను మరింత గ్రాండ్‌‌గా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు.  అక్టోబర్‌‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, భారీ షెడ్యూళ్లతో చిత్రీకరణ కొనసాగించనున్నట్టు శుక్రవారం అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్.  2027 జూన్ నాటికి  సినిమా ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలియజేశారు.

ఫస్ట్ పార్ట్  సక్సెస్‌‌తో  సీక్వెల్‌‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్‌‌’తోపాటు ‘ఫౌజీ’ చిత్రాలను పూర్తి చేసే 
పనిలో ఉన్నాడు.