కాకా డబ్బింగ్ బిగిన్స్

కాకా డబ్బింగ్ బిగిన్స్

చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో  కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కాకా’.  ప్రస్తుతం ఈ మూవీ  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు షూటింగ్‌‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు  కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.

తాజాగా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్టు మేకర్స్ తెలియజేశారు.  ద బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేసేందుకు ఫుల్ స్పీడ్‌‌లో టీమ్ వర్క్ చేస్తోందని చెప్పారు.  అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్‌‌గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.  

తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌‌కు మంచి రెస్పాన్స్ రాగా,  సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి, బాబీ కాంబోలో రాబోతున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.