- 6 నెలల తర్వాత కార్పొరేషన్కౌన్సిల్ మీటింగ్30 అంశాలకు ఆమోదం
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్పరిధిలో 20 ఎకరాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ ప్రకటించారు. ఆరు నెలల తర్వాత శుక్రవారం రామగుండం కార్పొరేషన్ఆఫీస్లో నిర్వహించిన కౌన్సిల్ సమావేశానికి ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో హాజరై మాట్లాడారు. హైదరాబాద్ లో నిర్మిస్తున్న తరహాలో రామగుండంలో ఇందిరమ్మ టవర్స్ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. లబ్దిదారులకు ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలతోపాటు, అదనంగా మరో రూ.5 లక్షలు రుణం ఇప్పించి ప్రభుత్వమే ఈ భవనాలు నిర్మించి ఇస్తుందని చెప్పారు. కార్పొరేషన్‌ద్వారా రూ.600 కోట్లు, ఇతర శాఖల ద్వారా మరో రూ.600 కోట్లతో భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి గడించేలా రామగుండంను తీర్చిదిద్దేలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
నగర రూపురేఖలు మారబోతున్నయ్
సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌తో రామగుండం నగర రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. రూ.120 కోట్లతో స్టార్మ్ వాటర్ డ్రెయిన్స్, రూ.25 కోట్లతో కమర్షియల్ కాంప్లెక్స్, రూ.30 కోట్లతో 7.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, రూ.135 కోట్లతో వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్, రూ.152 కోట్లతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, డంపింగ్ యార్డ్‌లో బయో మైనింగ్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 31 అంశాలు ప్రవేశ పెట్టగా నెలవారీ నీటి ఛార్జీలు పెంచాలనే 20వ అంశం మినహా మిగిలిన 30 అంశాలను ఆమోదించారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, నగర పాలక సంస్థ కమిషనర్ జె.అరుణ శ్రీ, వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు పాల్గొన్నారు.
