అంబర్‌పేట, వెలుగు: బతుకమ్మ కుంట భూవివాదానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఏడ్ల సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.
రంగనాథ్ ఆల్ ఇండియా సర్వీస్ (కండక్ట్) రూల్స్-1968ను ఉల్లంఘించారని ఆరోపించారు. న్యాయస్థానంలో విచారణలో ఉన్న అంశానికి సంబంధించిన సాక్ష్యాలను మీడియా ముందు ప్రస్తావించి, తప్పుడు కథనాలతో తన ప్రతిష్ఠను దెబ్బతీశారని పేర్కొన్నారు.
