HCAపై మరో కేసు నమోదు

HCAపై మరో కేసు నమోదు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు నమోదైంది. మ్యాచ్ టికెట్ల విక్రయం, తొక్కిసలాటలో భాగంగా ఇప్పటికే  3 కేసులు నమోదు కాగా... తాజాగా బేగంపేట్ పోలీసులు, హెచ్‌సీఏపై మరో కేసు నమోదు చేశారు. మ్యాచ్ టికెట్ పై ఉన్న సమయం, మ్యాచ్ ప్రారంభమైన మ్యాచ్ వ్యత్యాసం ఉందంటూ ఫిర్యాదు రావడంతో ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. టికెట్ పై మ్యాచ్ ప్రారంభ సమయం 7:30 ఉండగా 7 గంటలకే ప్రారంభమైందని ఇటీవల బేగంపేట్ పీఎస్ లో ఓ యువకుడు ఫిర్యాదు చేశాడు. దీంతో టికెట్ పై HCAపై తప్పుడు టైమింగ్ ఇచ్చిందంటూ యువకుడు కంప్లైంట్ లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో బేగంపేట పోలీసులు క్రికెట్ అసోసియేషన్ పై కేసు ఫైల్ చేశారు. తాజాగా నమోదైన కేసుతో HCAపై ఫైల్ అయిన కేసుల సంఖ్య 4 కు చేరింది. ఇదిలా ఉండగా టికెట్ విక్రయం సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 

భారత్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ లో భాగంగా ఈ నెల 25న మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ టికెట్ల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆన్ లైన్ లో పెట్టిన కాసేపటికే టికెట్లు అమ్ముడుపోయానని చూపించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర ఆందోళనల తర్వాత ఆఫ్ లైన్ లో టికెట్లు ఇస్తామని హెచ్‌సీఏ ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో క్రికెట్ అభిమానులు జింఖానా మైదానానికి చేరుకుని టికెట్లు దక్కించుకోవడానికి ఎగబడ్డారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తతంగా మారింది.