కాఫీ పడింది.. విమానం ఆగింది

కాఫీ పడింది.. విమానం ఆగింది

ఒక్కోసారి చిన్న చిన్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంటుంది. అలాంటిదే ఈ సంఘటన. ఓ కాఫీ వల్ల 337 మంది ప్రయాణిస్తున్న ఫ్లైట్‌‌‌‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావల్సి వచ్చింది. కండోర్‌‌‌‌ విమానం ఒకటి జర్మనీలోని ఫ్రాంక్‌‌‌‌ఫర్ట్‌‌‌‌ నుంచి మెక్సికోలోని కాన్‌‌‌‌కన్‌‌‌‌కు బయలుదేరింది. ఫ్లైట్‌‌‌‌లో11 మంది సిబ్బంది, 326 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఫ్లైట్‌‌‌‌ నడుపుతుండగా అనుకోకుండా విమానం ఆడియో కంట్రోల్‌‌‌‌ ప్యానెల్‌‌‌‌పై కాఫీ పడింది. డోర్‌‌‌‌‌‌‌‌కు వెనకాల డోర్‌‌‌‌‌‌‌‌ నెట్టితే ఈజీగా కింద పడేలా కాఫీ కప్పు పెట్టడం, దానికి పైలట్‌‌‌‌ చెయ్యి తగలడంతో కాఫీ అంతా ప్యానల్‌‌‌‌పై ఒలికిపోయింది. దీంతో కంట్రోల్‌‌‌‌ ప్యానల్‌‌‌‌లో సమస్య వచ్చి రేడియో సిగ్నల్‌‌‌‌ కమ్యూనికేషన్‌‌‌‌ సిస్టమ్ మొరాయించింది.

కాక్‌‌‌‌పిట్‌‌‌‌ నుంచి కాలిన వాసన, పొగ రావటం మొదలైంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ఐర్లాండ్‌‌‌‌లోని షానన్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌లో ల్యాండ్‌‌‌‌ చేశారు. కాక్‌‌‌‌పిట్‌‌‌‌లో నుంచి పొగ రావడంతో ఫ్లైట్‌‌‌‌ను దించామని, ఇంజినీర్లు దాన్ని రిపేర్‌‌‌‌ చేశాక మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌ మీదుగా మళ్లీ నడిపామని కండోర్‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌ ప్రతినిధి తెలిపారు. కాఫీ కప్పుల్ని కప్‌‌‌‌ హోల్డర్‌‌‌‌‌‌‌‌లో పెట్టుకోవాలని చెప్పుతున్నప్పటికీ పైలట్‌‌‌‌ వినిపించుకోకపోవడంతో ఈ ఘటన జరిగింది.