భార్యతో గొడవ.. అడ్డొచ్చిన మామను పొడిచేసిన అల్లుడు

భార్యతో గొడవ.. అడ్డొచ్చిన మామను పొడిచేసిన అల్లుడు
  • హైదరాబాద్ మియాపూర్ లో ఘటన 

హైదరాబాద్: భార్యతో గొడవ పడుతున్న అల్లుడిని సర్దిచెప్పేందుకు వెళ్లిన మామ.. అల్లుడు కత్తితో దాడి చేయడంతో కుప్పకూలి కన్నుమూశాడు. మియపూర్ పోలీస్ స్టేషన్ పరిధి అదిత్యనగర్ లో చోటు చేసుకుందీ ఘటన. సొంత మామా షైక్ హఫీజ్ (45) ను సొంత అల్లుడు ఒమర్ కత్తి తో దాడి చేసి హత్య చేసిన ఉదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. 
కూతురు రేష్మ బేగం, అల్లుడు ఒమర్ వివాద ముదిరిపోతుండడంతో మామ షేక్ హఫీజ్ స్పందించి సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించాడు. కూతురితో ఘర్షణ నేపథ్యంలో ఒమర్ ఇంటికి మాట్లాడేందుకు వెళ్లిన రేష్మ బేగం తండ్రి షైక్ హఫీజ్ అల్లుడితో మాట్లాడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. చిన్నపాటి ఘర్షణ జరగగా కోపంతో ఊగిపోయిన అల్లుడు ఒమర్  మామా షైక్ హఫీజ్ ను కత్తి తో మెడ భాగంలో దాడి చేయడంతో ఘటన స్థలంలోనే కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.