బండి సంజయ్ అబద్దాల కోరు

బండి సంజయ్ అబద్దాల కోరు

రెండేళ్లుగా కేసీఆర్ ను జైల్లో పెడతామంటూ ప్రగల్భాలు పలకడం తప్ప బండి సంజయ్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నేత పొన్న ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జైలును మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,  ఇతర కాంగ్రెస్ నేతలు సందర్శించారు. ఇటీవల బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాను కరీంనగర్ జైలును చూసేందుకు వచ్చామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టేందుకు వీలుగా కరీంనగర్ లో గది కట్టించామంటూ వరంగల్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో గది చూద్దామని వచ్చానని పొన్నం స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో జైలులోకి వచ్చేందుకు పోలీసులు పొన్నంకు అనుమతి నిరాకరించారు. జైలు గేటు దగ్గరే నిలిపివేశారు. దీంతో జైలు గేటు దగ్గర కేసీఆర్ కోసం కట్టిన గది చూపించాలని నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నేతలతో కలిసి పొన్నం ఆందోళన చేశారు. అంతలోనే అక్కడికి చేరుకున్న సబ్ జైలు అధికారిని గది చూపించాలని కోరారు. అనంతరం డిప్యూటీ జైలర్ పొన్నంతో మాట్లాడారు. ఎలాంటి కొత్త గదులు కట్టలేదని పాతవే ఉన్నాయని వివరణ డిప్యూటీ జైలర్ వివరణ ఇచ్చారు. బండి సంజయ్ చెప్పినట్టుగా కొత్తగా ఏమైనా గదులు కట్టి, అందులో సౌకర్యాలేమైనా ఏర్పాటు చేశారా అని పొన్నం ప్రశ్నించారు. ఈ క్రమంలో అలాంటిదేమీ లేదని జైలర్ చెప్పడంతో... బండి సంజయ్ పై పొన్నం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ అబద్దాలకోరు అని తేలిందన్న ఆయన ఆరోపించారు. రెండేళ్లుగా కేసీఆర్ ను జైల్లో పెడతామని చెప్పడమే తప్ప బండి సంజయ్ చేసిందేమీ లేదని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు.