జూబ్లీహిల్స్, వెలుగు: బోరబండ పీఎస్ పరిధిలో శనివారం అన్నదమ్ములు మహమ్మద్ షా ఫైజల్, ముబీన్భూమి, డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. అడ్డుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ పి.యజుర్వేదపై ఫైజల్ సుత్తితో దాడి చేశాడు. దుకాణంలోని వస్తువులను ధ్వంసం చేస్తుండగా ఆపేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ ముఖం, పక్కటెముకలపై నిందితుడు దాడికి తెగబడ్డాడు. గాయపడిన బాధితురాలిని హాస్పిటల్కు తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.
