బెల్ట్​షాపులో మందు కొట్టిన కానిస్టేబుల్స్

బెల్ట్​షాపులో మందు కొట్టిన కానిస్టేబుల్స్
  • వీడియో తీసి సీపీకి పంపిన వ్యక్తి

వైరా, వెలుగు: నలుగురు కానిస్టేబుల్స్, ఓ హోంగార్డు  బెల్ట్​షాపులో మద్యం తాగుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి వాట్సప్ లో ఖమ్మం సీపీకి పంపించాడు. దీంతో వారిపై సీపీ చర్యలు తీసుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌‌స్టేషన్‌‌లో డ్యూటీ చేస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు మరో హోంగార్డ్​ అదే మండలంలోని అమ్మపాలెం గ్రామంలో ఇటీవల ఓ ఫంక్షన్‌‌కు వెళ్లారు. అక్కడికి వెళ్లే క్రమంలో ఓ బెల్టు షాపు దగ్గర మద్యం తాగారు. దానిని ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో వాట్సప్‌‌ ద్వారా సీపీ విష్ణు ఎస్. వారియర్​కు పంపించడంతో నలుగురిని శుక్రవారం ఆయన ఆఫీస్​కి పిలిపించారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉండి ఇలా చేయడమేంటని, తప్పు ఎవరు చేసినా ఊరుకునేది లేదని సీపీ వార్నింగ్‌‌ ఇచ్చారు. నలుగురు కానిస్టేబుళ్లు, మరో హోంగార్డును ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ ​చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.