మంగల్ పల్లిలోని రాఘవేంద్ర హోటల్ లో బటర్ మిల్క్లో ఈగలు...నలుగురు కస్టమర్లకు అస్వస్థత

మంగల్ పల్లిలోని రాఘవేంద్ర హోటల్ లో బటర్ మిల్క్లో ఈగలు...నలుగురు కస్టమర్లకు అస్వస్థత

ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల సర్కిల్ మంగల్​పల్లిలోని రాఘవేంద్ర హోటల్​లో కలుషిత బటర్ మిల్క్ తాగి నలుగురు కస్టమర్లు అస్వస్థతకు గురయ్యారు. హోటల్​లో వారు ఆర్డర్ చేసిన బట్టర్ మిల్క్​లో ఈగలు కనిపించడంతో సిబ్బందిని నిలదీయగా, వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 

కొద్దిసేపటికే ఆ నలుగురు తీవ్ర అస్వస్థతకు లోనుకావడంతో వెంటనే ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు సదరు హోటల్​లో తనిఖీలు చేపట్టారు.